ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు మధ్య జరుగుతున్న మ్యాచ్ లో, టాస్ గెలిచి రాయల్ చాలెంజర్స్, బెంగుళూరు ఫీల్డింగ్ ఎంచుకుంది.
మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ ఆరు వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. ఓపెనర్లు ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ చెరో 26 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ఆ తరవాత వచ్చిన బ్యాట్స్ మన్ ల లో సూర్యకుమార్ యాదవ్ ఒక్కడే ఆడాడు, అద్భుతం గా ఆడాడు. సూర్యకుమార్ యాదవ్ కేవలం 37 బంతుల్లో, ఆరు సిక్సర్లు, ఐదు ఫోర్ల సహాయంతో 68 పరుగులు చేసి అజేయం గా నిలిచాడు. తిలక్ వర్మ, కీరన్ పోలార్డ్ లు డక్ అవుట్ అయ్యారు. రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు బౌలర్ల లో హాసరంగా, హర్షల్ పటేల్ లు చెరో రెండు వికెట్లు తీశారు. ఆకాష్ దీప్ కు ఒకటి వికెట్ దక్కింది
Recent Comment