అల్లు అర్జున్‌(Allu Arjun), రష్మిక మందన్నా( Rashmika Mandanna) హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘పుష్ప’. లెక్కల మాస్టారు సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా డిసెంబర్‌ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయింది. అలాగే జనవరి 7న ఓటీటీలో రిలీజైన పుష్ప తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లోనూ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. అయితే ఈ మూవీ సీక్వెల్‌గా పుష్ప: ది రూలర్‌ పార్ట్‌ 2 ప్రస్తుతం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పుష్ప పార్ట్ 2 సినిమాలోని ఐటెం సాంగ్ విషయంలో దర్శకుడు సుకుమార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

పుష్ప పార్ట్ 1లో సమంత స్పెషల్‌ సాంగ్‌ ఊ అంటావా మావా ఊఊ అంటావా పాట ఏ రెంజ్‌లో విజయం సాధించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ క్రమంలోనే ఇప్పుడు రెండో భాగంలో అంతకుమించిన స్పెషల్ సాంగ్ ఉండాలని ప్లాన్ చేస్తున్నారట సుకుమార్. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దిశా పటానిని(Disha Patani) రంగంలోకి దించనున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయంపై ఇప్పటికే దిశా పటానిని సంప్రదించారని, దీనికి ఆమె కూడా అంగీకారం తెలిపిందని వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.