ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు వారసుడిగా ఆయన సోదరుడు శిరీష్ తనయుడు అశిష్ హీరోగా పరిచమైన చిత్రం ‘రౌడీ బాయ్స్’. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించగా బాక్సఫీసు వద్ద చక్కటి విజయాన్ని నమోదు చేసింది. ఇప్పుడు అదే జోరులో ఈ యువ హీరో రెండో సినిమాను ప్రారంభించాడు. ‘సెల్ఫిష్’ పేరుతో సినిమాను ప్రకటిస్తూ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. శ్రీ వెంకటేశ్వర క్రియేష్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై దిల్ రాజు, సుకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ క్లాప్ కొట్టి షూటింగ్ ప్రారంభించాడు. అలాగే ఈ కార్యక్రమానికి కిషి విశాల్, దిల్‌రాజు, మిక్కీ జే మేయర్, సుకుమార్ సహా పలువురు హాజరయ్యారు. విశాల్ కాశీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, అనిల్ రావిపూడి తొలి షాట్ కు దర్శకత్వం వహించాడు. మణి కందన్ సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ సినిమాకి మిక్కీ జె.మేయర్ సంగీత స్వరాలూ సమకూర్చనున్నారు.
Recent Comment