ముంబై ఇండియన్స్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది.  మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 4 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది.  కెప్టెన్ రోహిత్ శర్మ మూడు పరుగులకే అవుట్ అవగా, మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ 14 పరుగులకు ఔట్ అయ్యాడు.  అయితే ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్ మన్ అందరూ వందకు పైగా స్ట్రైక్ రేట్ తో ఆడారు.

దేవాల్డ్ బ్రెవిస్ 19 బంతుల్లో 29 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 36 బంతుల్లో 52 పరుగులు, తిలక్ వర్మ 27 బంతుల్లో 38 పరుగులు చేశారు. 

అయితే చివర్లో కీరన్ పోలార్డ్ మూడు సిక్సర్ల సాయంతో కేవలం 5 బంతుల్లో 22 పరుగులు చేశాడు.

కోల్ కతా నైట్ రైడర్స్ బౌలర్ల లో పాట్ కమ్మిన్స్ రెండు వికెట్లు తీయగా, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి తలా ఒక వికెట్ తీశారు