దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ మల్టీ స్టారర్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఈ సినిమాలో కొమురం భీమ్‌గా యంగ్ టైగర్ ఎన్టీఆర్‌(Ntr), అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌(Ramcharan) ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. దాదాపు రూ. 400 కోట్లు భారీ బడ్జెట్‌తో ఈ పాన్‌ ఇండియా సినిమాను డీవీవీ దానయ్య నిర్మించారు. యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మార్చి 25న విడుదల కానుంది.

ఈ క్రమంలోనే ఈ సినిమాకు కథ అందించిన విజయేంద్ర ప్రసాద్‌ ఆర్ఆర్ఆర్ మూవీ ఇంటర్వెల్‌పై పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
ఈ సినిమా గురించి విజయేంద్ర ప్రసాద్‌ మాట్లాడుతూ.. ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్‌, ఎన్టీఆర్ ఇద్దరూ ప్రాణస్నేహితులు. కానీ ఇద్దరి మనస్తత్వాలు వేరువేరుగా ఉంటాయి. సినిమా మొదలయ్యాక చరణ్-ఎన్టీఆర్ భిన్న స్వభావాలున్న వ్యక్తులని తెలుస్తుంది. అయితే కథ మధ్యలోకి వెళ్లిన తర్వాత వీరిద్దరి మధ్య అభిప్రాయా బేధాలు రాకుండా ఉంటే బాగుండు అనిపిస్తుంది. వీరిద్దరి మధ్య ఇంటర్వెల్ సమయంలో వచ్చే ఫైట్ సీన్ చూసి భోరున ఏడ్చేశా అని విజయేంద్ర ప్రసాద్ అన్నారు.