పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌( Pawan Kalyan), యంగ్ హీరో రానా దగ్గుబాటి (Rana Daggubati) నటించిన చిత్రం “భీమ్లా నాయక్‌”( Bheemla Nayak). ఫిబ్రవరి 25వ తేదీన విడుదలైన ఈ సినిమా బాక్సఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. అలాగే “భీమ్లా నాయక్‌” మూవీ మార్చి 24న ఒకేసారి డిస్నీ+ హాట్‌స్టార్‌తో పాటు ఆహాలో విడుదలైంది.
అయితే ఓటీటీలో ఈ మూవీ ఇప్పుడు పలు రికార్డులను సాధిస్తోంది.

అహాలో ఫాస్టెస్ట్ 100 మిలియన్ మినిట్స్‌ని “భీమ్లానాయక్” పూర్తి చేసుకుంది. ఇక ఓటీటీలో కూడా ఈ మూవీ సాధిస్తున్న రికార్డులతో పవర్ స్టార్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా, సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో నిత్యా మీనన్‌ , సంయుక్త మీనన్‌ కథానాయికలుగా నటించారు. మలయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ తెలుగు రీమేక్‌గా సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు