సన్ రైజర్స్ హైదరాబాద్  ముందు భారీ లక్ష్యాన్ని ఉంచిన రాజస్థాన్ రాయల్స్.  మొదట బ్యాటింగ్ చేసిన  రాజస్థాన్ రాయల్స్ ఆరు వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది.

సమిష్టి కృషి కి మారు పేరు రాజస్థాన్ రాయల్స్.  టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్  కు రాజస్థాన్ రాయల్స్ బ్యాట్సమెన్ చుక్కలు చూపించారు. ప్రతి బ్యాట్స్ మెన్ తమ వంతు పాత్ర పోషించారు.

ఓపెనర్లు బట్లర్, జైస్వాల్ తొలి వికెట్ కు ఆరు ఓవర్ల లో 58 పరుగులు జోడించారు. బట్లర్ 35 పరుగులు , జైస్వాల్ 20 పరుగులు చేసి అవుట్ అయ్యారు. 

ఆ తరవాత వచ్చిన సంజూ శాంసన్, పడిక్కల్ చెలరేగి పోయారు. సంజూ శాంసన్ 27 బంతుల్లో 55 పరుగులు, పడిక్కల్ 29 బంతుల్లో 41 పరుగులు చేశారు.   చివర్లో వచ్చిన హెట్ మేయర్ కేవలం 13 బంతుల్లో 32 పరుగులు చేశాడు

సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్ల లో నటరాజన్, ఉమ్రాన్ మాలిక్ రెండేసి వికెట్లు తీయగా షెపర్డ్, భువనేశ్వర్ కుమార్ తలా ఒక వికెట్ తీశారు.

అనంతరం 211 పరుగుల విజయ లక్ష్యం తో బ్యాటింగ్ ప్రారంభించిన సన్ రైజర్స్ హైదరాబాద్  తడబడుతూనే బ్యాటింగ్ కొనసాగించింది.

38 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల లోతు కష్టాల్లో పడింది. రాహుల్ త్రిపాఠి, నికోలస్ పూరన్ డక్ అవుట్ అయ్యారు.  మార్కరం కొంతవరకు ప్రతిఘటించిన, అతనికి సహకారం అందించే వారు లేరు.  మార్కరం 57 పరుగులతో అజేయం గా నిలిచాడు.

ఆఖర్లో వాషింగ్టన్ సుందర్ మెరుపులు మెరిపించాడు.  కేవలం 14 బంతుల్లో 40 పరుగులు చేశాడు.

సన్ రైజర్స్ హైదరాబాద్  నిర్ణీత 20 ఓవర్ లు ముగిసేసరికి ఏడు వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది.

రాజస్థాన్ రాయల్స్ బౌలర్ల లో బౌల్ట్, ప్రసిద్ కృష్ణ చెరో రెండు వికెట్లు తీయగా, స్పిన్నర్ చాహల్ 3 వికెట్లు తీశాడు.

ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ : సంజూ శాంసన్