మెగాస్టార్‌ చిరంజీవి ( Chiranjeevi ) కథానాయకుడుగా డైరెక్టర్ కొరటాల శివ( Koratala Shiva ) దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఆచార్య'(Acharya). మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ( Ram Charan ) ఇందులో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా చందమామ కాజల్ హీరోయిన్‌గా నటించగా.. రామ్‌ చరణ్‌కు జంటగా బుట్టబొమ్మ పూజా హెగ్డే నటించింది. అలాగే సోనూసూద్‌ ముఖ్య పాత్ర పోషించాడు. రామ్‌చరణ్, నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్‌ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదిలాఉంటే, ‘ఆచార్య’ సినిమాలో కొన్ని స‌న్నివేశాల‌ను చిరంజీవి, రామ్ చరణ్ లపై మారేడు మిల్లి ఫారెస్ట్‌ అటవీ ప్రాంతంలో చిత్రీక‌రించిన సంగతి తెలిసిందే. అయితే ఆ షూటింగ్ స‌మ‌యంలో రామ్ చ‌ర‌ణ్ మేక‌ప్ వేసుకుంటుండగా ఓ వాన‌రం ఆయ‌న ఉండే గదిలోకి వచ్చింది. ఇది గ‌మ‌నించిన రామ్ చ‌ర‌ణ్ తనవద్ద ఉన్న బిస్కెట్స్‌ను దానికి అందించారు. ఆ వాన‌రం ఆ బిస్క‌ట్స్‌ను తింటూ కాసేపు అక్కడే కూర్చుంది. ఈ వీడియోను హ‌నుమాన్ జ‌యంతి సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో అందర్నీ ఆకట్టుకుంటోంది.