ఇండియన్ క్రికెట్ కు క్రేజ్ వచ్చిందంటే అది కచ్చితం గా సచిన్ టెండూల్కర్ వల్లే. ఎంతమంది దిగ్గజ ఆటగాళ్లు భారత జట్టులోకి వచ్చిన సచిన్ క్రేజ్ వేరు, అందుకే సచిన్ ను గాడ్ అఫ్ క్రికెట్ అంటారు.
భారత రత్న అందుకున్న ఏకైక భారత క్రికెటర్. రెండు దశబ్దాల కాలంలో 664 మ్యాచ్ లు ఆడాడు. ఒక రోజు అంతర్జాతీయ మ్యాచ్ లలో డబల్ సెంచరీ చేసిన తొలి క్రికెటర్. అన్ని ఫార్మాట్లలో కలిపి 100 సెంచరీలు చేసిన తొలి క్రికెటర్ సచిన్ టెండూల్కర్. ఇప్పటికి ముంబై ఇండియన్స్ టీం మెంటార్ గా ఉన్నాడు.
ఈ రోజు (24th April), క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పుట్టిన రోజు. ఈ పుట్టిన రోజు సచిన్ టెండూల్కర్ మాటల్లో
“నా పుట్టినరోజు వారాన్ని ప్రారంభించేందుకు ఎంత మార్గం! సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్ ద్వారా మద్దతిచ్చే ఈ అద్భుతమైన అమ్మాయిలతో నేను ఫుట్‌బాల్ ఆడటం, కథలు పంచుకోవడం మరియు నా పుట్టినరోజు కేక్ కట్ చేయడం చాలా ఆనందించాను. వారు నాకు శుభాకాంక్షలు తెలిపిన మొదటి వ్యక్తులు మరియు ఇది నా వారాన్ని నిజంగా ప్రత్యేకంగా చేసింది!”
Recent Comment