నటసింహం నందమూరి బాలయ్య(Bala Krishna) కథానాయకుడుగా యువ దర్శకుడు గోపిచంద్ మలినేని(Gopichand Malineni) ఓ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్య పవర్ఫుల్ రోల్ లో ఆకట్టుకోనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ ఈ సినిమా ‘NBK107’ వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతోంది. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఆసక్తికర వార్త ఇపుడు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ కానుకగా NBK 107 మూవీ ఫస్ట్ లుక్, టైటిల్ ను ప్రకటించనున్నట్లు సమాచారం.
ఉగాది పర్వదినం సందర్భంగా అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ భారీ అప్ డేట్స్ ఇవ్వాలని చిత్రబృందం నిర్ణయించినట్లు తెలుస్తోంది.ఈ చిత్రంలో కన్నడ యాక్టర్ దునియా విజయ్ (Duniya Vijay) విలన్‌గా నటిస్తున్నాడు. అలాగే ఈ సినిమాలో బాలకృష్ణకు జోడిగా శ్రుతిహాసన్ నటిస్తోంది. వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్నారు. కాగా, వాస్తవ సంఘటనలతో రూపొందనున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టే దర్శకుడు గోపిచంద్ మలినేని మంచి కథను సిద్దం చేసుకున్నట్లు తెలుస్తుంది.
Recent Comment