కోలీవుడ్‌ అగ్ర కథానాయకుడు దళపతి విజయ్‌ హీరోగా నటించిన చిత్రం ‘బీస్ట్‌’ ( Beast Movie ). నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో టాలీవుడ్‌ బుట్టబొమ్మ పూజా హెగ్డే (Pooja Hegde ) హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో షైన్‌ టామ్‌ చాకో, సెల్వరాఘవన్‌, యోగిబాబు ప్రధాన పాత్రలు పోషించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌లో కళానిధి మారన్‌ నిర్మాతగా వ్యవహరించగా అనిరుధ్‌ రవిచంద్రన్‌ సంగీత స్వరాలూ సమకూర్చారు.

అయితే భారీ తారాగ‌ణం, భారీ బడ్జెట్‌, హై టెక్నిక‌ల్ వేల్యూస్‌తో రూపొందిన ఈ చిత్రం భారీ అంచ‌నాల న‌డుమ ఏప్రిల్ 13న విడుదలైంది. అయితే ఈ సినిమాకి విడుదలైన తొలి రోజే బాక్సఫీసు వద్ద మిశ్రమ స్పందన లభించింది. దాంతో ఆ ప్రభావం కలెక్షన్లపై కూడా పడింది. ఇక బీస్ట్ సినిమాకు విడుదలైన 6 రోజుల్లో కేవలం 97 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది. మరో 32 కోట్లు వసూలు చేస్తేనే ఈ సినిమా క్లీన్ హిట్ అనిపించుకుంటుంది.

ఈ సినిమాకు విడుదలైన 6 రోజుల్లో వచ్చిన కలెక్షన్స్ పరిశీలిస్తే.. ఏపీ, తెలంగాణలో 6.98 కోట్లు,కర్ణాటకలో 6.14కోట్లు, తమిళనాడులో 51.05 కోట్లు, కేరళలలో 4.63 కోట్లు,,హిందీ,రెస్టాఫ్ ఇండియాలో 1.60 కోట్లు, ఓవర్సీస్ లో 26.65 కోట్లు కలెక్షన్స్ వచ్చాయి. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు విడుదలైన 6 రోజుల్లో 97.05 కోట్లు వసూళ్లు వచ్చాయి. ఈ సినిమా నష్టాల పాలవ్వకుండా ఉండాలంటే 130 కోట్లు షేర్ కలెక్షన్స్ రాబట్టాలి. అయితే ప్రస్తుతం బాక్సఫీసు వద్ద కేజీఎఫ్ 2 దూసుకుపోతుండడం ఈ సినిమాకు మైనస్ అని చెప్పొచ్చు.