యంగ్ రెబల్ స్టార్‌ ప్రభాస్‌ ( Prabhas ) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆయన నటించిన రాధేశ్యామ్‌ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ప్ర‌భాస్ న‌టించిన ‘ఆదిపురుష్’ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను జరుపుకుంటుండగా.. ఆయన నటించిన ‘స‌లార్’ , ‘ప్రాజెక్ట్-K’ సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. వీటితోపాటుగా సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ‘స్పిరిట్’ సినిమా ప్ర‌స్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. అయితే వీటితో పాటుగా ప్రభాస్‌ మారుతి ( Maruthi ) దర్శకత్వంలో ఓ పాన్‌ ఇండియా సినిమా చేయనున్నాడన్న సంగతి తెలిసిందే. కామెడీ, హార్రర్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం రూపొందనుంది.

తాజా స‌మాచారం ప్రకారం మారుతితో చేయనున్న సినిమానుఈనెలలోనే ప్రారంభించాలని ఫిక్స్ అయ్యాడట. ఈ క్రమంలోనే ఏప్రిల్ 10న ఈ సినిమాని అధికారికంగా ప్రకటించాలని ప్రభాస్ నిర్ణయించుకున్నాడని తెలుస్తోంది. అలాగే ఈ సినిమాకి రాజా డీలక్స్ అనే టైటిల్ విషయంలో కాస్త నెగిటివ్ టాక్ రావడంతో ఆ టైటిల్‌ను పక్కన పెట్టేసినట్లు సమాచారం. ప్రస్తుతం విదేశాల్లో విశ్రాంతి తీసుకుంటున్న ప్రభాస్ అక్కడి నుంచి వచ్చే లోపు ఈ సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తిచేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో మొత్తంగా ముగ్గురు హీరోయిన్లుంటారని తెలుస్తుండగా.. రాశీ ఖన్నా, ప్రియాంక మోహనన్ వంటి హీరోయిన్ల పేర్లు వినిపిస్తున్నాయి.