మాస్‌ మహారాజ రవితేజ( Raviteja) హీరోగా నటించిన తాజా చిత్రం రామారావు ఆన్‌డ్యూటీ. (Rama Rao On Duty) ఈ చిత్రాన్ని జూన్‌ 17న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. కాగా, శరత్‌ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్‌, రజిషా విజయన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాతో వేణు తొట్టెంపూడి రీఎంట్రీ ఇస్తున్నాడు.

అలాగే ఈ సినిమాలో నాజర్‌, తనికెళ్ల భరణి, పవిత్రాల ఓకేశ్‌ ముఖ్యపాత్రల్లో నటించారు. అయితే తాజాగా శ్రీరామనవమి పండుగ సందర్భంగా ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ ను విడుదల చేశారు మేకర్స్. సామ్ సీఎస్ సంగీతం అందించిన ‘బుల్ బుల్ తరంగ్’​ అనే ఈ పాటను సిద్ శ్రీరామ్ ఆలపించారు. విడుదలైన నిమిషాల్లోనే ఈ సాంగ్ యూట్యూబ్ లో దూసుకుపోతోంది. కాగా, సుధాకర్‌ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాలో రవితేజ డిప్యూటీ కలెక్టర్‌గా కనిపించనున్నాడు.