కన్నడ స్టార్‌ హీరో యశ్‌(Yash) కథానాయకుడుగా, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్‌ నీల్‌(Prashanth Neel) దర్శకత్వంలో రూపొందుతున్న పాన్‌ ఇండియా మూవీ “కేజీఎఫ్‌-2″(KGF Chapter 2) నాలుగేళ్ల కిందట బాక్సాఫీస్‌ రికార్డులను తిరగరాసిన కేజీఎఫ్‌ సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని హోంబలే ఫిలింస్‌ పతాకంపై విజయ్‌ కిరగందూర్ నిర్మిస్తున్నారు. కన్నడ, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కేజీఎఫ్‌ 2 వేసవి కానుకగా ఏప్రిల్ 14న విడుదల కానుంది.

అయితే తాజాగా KGF chapter 2 మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ విష‌యంలోనూ అరుదైన రికార్డు సాధించింది. ఈ క్రమంలోనే రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా రికార్డుల‌ను KGF 2 బద్దలుకొట్టింది. ఏప్రిల్ 7న ఈ సినిమా హిందీ వెర్షన్ కు సంబంధించి కొన్ని ప్రాంతాల థియేటర్లల్లో టికెట్స్ బుకింగ్‌ ప్రారంభం కావడంతో అభిమానులు పోటెత్తారు. ఈ బుకింగ్స్ ప్రారంభమైన తొలి 12 గంటల్లోనే దాదాపు లక్ష టిక్కెట్లు సేల్ అయ్యాయి. కేవలం ఈ బుకింగ్స్ ద్వారానే ఇప్పటివరకు రూ. 14 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయని తెలుస్తోంది. ఇటీవల విడుదలైన RRR సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో కేవలం 7 కోట్లు వసూళ్లు వస్తే.. KGF 2 మాత్రం రూ. 14 కోట్లు వసూలు కావడం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.