కన్నడ స్టార్‌ హీరో యశ్‌ కథానాయకుడుగా, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్‌ ఇండియా మూవీ “కేజీఎఫ్‌-2”. నాలుగేళ్ల కిందట బాక్సాఫీస్‌ రికార్డులను తిరగరాసిన కేజీఎఫ్‌ సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని హోంబలే ఫిలింస్‌ పతాకంపై విజయ్‌ కిరగందూర్ నిర్మిస్తున్నారు. కన్నడ, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కేజీఎఫ్‌ 2 వేసవి కానుకగా ఏప్రిల్ 14న విడుదల కానుంది. ఈ మూవీలో సంజయ్ దత్, శ్రీనిధి శెట్టి, ప్రకాశ్‌ రాజ్‌, రవీనా టండన్‌, రావు రమేశ్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించగా.. రవి బస్రూర్‌ సంగీతం అందించారు.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా రిలీజ్ కు ముందు భా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించేందుకు గాను దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తూన్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ మొదటి వారంలో బెంగళూరు లేదా ముంబయిలో ఈ ఈవెంట్ నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. అలాగే కేజీఎఫ్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చీఫ్ గెస్ట్ గా హాజరు కానున్నట్లు సమాచారం. ఎందుకంటే కేజీఎఫ్ మూవీ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ ప్రస్తుతం సలార్ సినిమాలో నటిస్తున్నాడు. అలాగే సలార్, కేజిఎఫ్2 రెండు సినిమాలను ఒకే బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ పాల్గొననున్నట్లు సమాచారం.ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది