మెగాస్టార్ చిరంజీవి యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తన 154వ చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే. ఇందులో చిరంజీవి సరసన హీరోయిన్‌గా శ్రుతిహాసన్‌ నటించనుంది. దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్నారు. కాగా ఇందులో మాస్ మహారాజా రవితేజ ఓ కీలక పాత్రలో సందడి చేయనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో చిరంజీవి, రవితేజ అన్నదమ్ముల పాత్రలో అలరించనున్నారని తెలుస్తోంది. అలాగే ఈ మూవీలో రవితేజకు జోడిగా తమిళ బ్యూటీ నివేదా పేతురాజ్‌ కనిపించనున్నట్లు తెలుస్తోంది.

అయితే తాజాగా సినిమా నుంచి ఓ ఆసక్తికర అప్‌డేట్ బయటకొచ్చింది. ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా నటిస్తున్న శృతిశృతి హాసన్, ఈ సినిమా సెట్స్ లోకి అడుగుపెట్టానని చెబుతూ ఓ ఫోటోని అభిమానులతో పంచుకుంది. ఇప్పటికే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుగుగుతుండగా తాజాగా శృతి హాసన్ కూడా ఇందులో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్‌లో చిరంజీవి, శృతి హాసన్, ఇతర తారాగణం మీద దర్శకుడు బాబీ కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరించనున్నాడని సమాచారం. కాగా, చిరంజీవి, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య సినిమా ఏప్రిల్‌ 29, 2022న విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే.