కన్నడ స్టార్‌ హీరో యశ్‌(Yash) కథానాయకుడుగా, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్‌ నీల్‌(Prashanth Neel) దర్శకత్వంలో రూపొందిన పాన్‌ ఇండియా మూవీ “కేజీఎఫ్‌-2″(KGF Chapter 2) నాలుగేళ్ల కిందట బాక్సాఫీస్‌ రికార్డులను తిరగరాసిన కేజీఎఫ్‌ సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కింది. ఈ చిత్రాన్ని హోంబలే ఫిలింస్‌ పతాకంపై విజయ్‌ కిరగందూర్ నిర్మించగా.. కేజీఎఫ్‌ 2 ఏప్రిల్ 14న వరల్డ్ వైడ్ గా విడుదలైంది. ఇందులో యశ్ న‌ట‌న‌, ప్రశాంత్ నీల్ టేకింగ్ కు ప్రేక్ష‌కులు మ‌రో సారి నీరాజనాలు పలికారు. తొలి రోజు రూ.134 కోట్ల గ్రాస్​ను అందుకున్న ఈ సినిమా రెండో రోజు రూ.275కోట్లు కలెక్షన్స్ రాబట్టింది.

ఇదిలా ఉంటే కేజీఎఫ్ సిరీస్‌కి చాప్ట‌ర్-2 ముగింపు కాదన్న సంగతి తెలిసిందే. ఎందుకంటే చాప్ట‌ర్‌-2 క్లైమాక్స్‌లో కేజీఎఫ్ మూడో భాగం కూడా ఉండ‌బోతున్న‌ట్లు దర్శకుడు ప్రశాంత్ నీల్ సర్ ప్రైజ్ ఇచ్చారు. ఈ క్రమంలోనే అభిమానులను ఉర్రుతలూగించే న్యూస్ ఒకటి ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. కేజీఎఫ్-3 మూవీ ప్రీ ప్రొడక్షన్​ పనులు కూడా ప్రారంభమయ్యాయని తెలుస్తోంది. ఈ విషయాన్ని ‘కేజీఎఫ్’​ ఎక్సుక్యూటివ్​ నిర్మాత​ కార్తిక్​ గౌడ చెప్పినట్లు సమాచారం. అయితే ఈ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్​ ప్రస్తుతం ప్రభాస్​తో ‘సలార్​’ సినిమాను తెరకెక్కించనున్నాడు. ఈ మూవీ పూర్తయిన తరువాత ‘కేజీఎఫ్​ 3’ని సెట్స్​పైకి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై త్వరలోనే అధికార ప్రకటన రానున్నట్లు సమాచారం.