గత కొంత కాలంగా తెలుగు సినిమా స్టామినా పాన్ ఇండియా స్థాయిలో దుమ్ము రేపుతోంది. టాలీవుడ్ దర్శకుల క్రియేటివిటీ కి పరభాషా చిత్రాల దర్శకులు, హీరోలు సైతం షాక్ అవుతున్నారు.
ఈ కోవలోనే అందరి దృష్టిని ఆకర్షించిన చిత్రం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన గని.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కు పెర్ఫెక్ట్ కమర్షియల్ హిట్ వచ్చి చాలా కాలమే అయింది. అందులోనూ కోవిడ్ 19 ప్రభావం కూడా గని చిత్రం ఆలస్యం అవడానికి ప్రధాన కారణం. ఈ చిత్రం స్టార్ట్ అయిన దగ్గరి నుంచి విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్స్ కు ఆడియన్స్ నుంచి ట్రమండస్ రెస్పాన్స్ రావడం తో ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ క్రమంలో ఈ చిత్రం ఏమేరకు ప్రేక్షకులని అలరించిందో ఓ సారి చూద్దాం.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, బాలీవుడ్ నటి సయీ మంజ్రేకర్ జంటగా నటించిన చిత్రం గని.
మెగా ఫ్యాన్స్ మాత్రమే కాకుండా బాక్సింగ్ ప్రియులు సైతం ఎంతో ఆక్తిగా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న ఈ కల్ట్ స్పోర్ట్స్ డ్రామా గని శుక్రవారం (ఏప్రిల్ 8) న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. గని మూవీతో కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా టాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తున్నారు. వరుణ్ తేజ్ ను ఓ డిఫరెంట్ మేకోవర్ తో బాక్సర్ గని గా స్టన్నింగ్ లుక్స్ తో ఆవిష్కరించిన దర్శకుడి ప్రతిభ గురించి అలాగే
బాక్సర్ గా వరుణ్ తేజ్ నట విశ్వరూపం గురించి..సినిమా ఏమేరకు ప్రేక్షకులని అలరించింది అనే అంశాలు వార్తా వినోదం పాఠకులకు ప్రత్యేకం.

‘గని’ మూవీ ప్రీమియర్ షోలు
యూఎస్ లో గురువారం నుంచే స్టార్ట్ అయ్యాయి.ఇప్పటికే యూఎస్ ప్రీమియర్ టాక్ పాజిటివ్ గా ఉండటం తో ఇప్పుడు ఇక్కడ కూడా క్రేజ్ ఓ రేంజ్ లో ఉంది.
వరుణ్ తేజ్ బాక్సర్ గా తన స్టన్నింగ్ లుక్స్ తో ఔట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టేశాడు.
ఈ చిత్రం కోసం బాక్సింగ్ లో ప్రత్యేక శిక్షణ తీసుకోవడం విశేషం.సిక్స్ ప్యాక్ లుక్ తో సామాన్యుల నుంచి సెలబ్రిటీలను సైతం ఆకట్టుకుంటున్నారు వరుణ్.
ఇక .. గని చిత్రం నిడివి విషయానికి వస్తె సుమారు 157 నిమిషాల లెంగ్త్ తో నడిచిన ఈ చిత్రం ఫస్ట్ హాఫ్ యావరేజ్ గా నడిచి ..సెకెండ్ హాఫ్ అదరగొట్టేసింది.

గని మూవీ రిలీజ్ డేట్:
ఏప్రిల్ 08,2022

నటీనటులు: వరుణ్ తేజ్, సయి మంజ్రేకర్, జగపతి బాబు, ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర తదితరులు

దర్శకుడు: కిరణ్ కొర్రపాటి

నిర్మాతలు: అల్లు బాబీ, సిద్ధు ముద్దా

సంగీత దర్శకుడు: థమన్ ఎస్

సినిమాటోగ్రఫీ: జార్జ్ సి విలియమ్స్ ISC

ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్

కథ విషయానికి వస్తే.
చిన్నప్పటినుండి తన తండ్రి
(ఉపేంద్ర) లాగా ప్రొఫెషనల్ బాక్సర్ కావాలనేది గని ( వరుణ్ తేజ్ )ఏకైక కల.అయితే క్రీడా రంగం లో
పాలిటిక్స్ కారణంగా గని తండ్రి చనిపోయినా సరే… తన కలను నెరవేర్చుకోవడానికి గని చేసిన కృషి కి సెల్యూట్ చెయ్యాల్సిందే.
గని కలను సాకారం చేసుకునేందుకు మాజీ బాక్సింగ్ ఛాంపియన్ విజయేంద్ర సిన్హా (సునీల్ శెట్టి) సహాయం తీసుకుని.. బాక్సర్ గా మారేందుకు శిక్షణ తీసుకుని బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ గెలిచి తన తండ్రి కలను ఎలా నెరవేరుస్తాడు అనేది సెళ్యులయిడ్ పై చాలా ఇంటెన్స్ స్పోర్ట్స్ డ్రామా గా మలిచిన తీరు ..డైరెక్టర్ కిరణ్ కొర్రపాటి ఎక్స్ట్రార్డినరీ టేకింగ్ థియేటర్స్ తప్పని సరిగా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్లు:

గని టైటిల్ రోల్ పోషించిన వరుణ్ తేజ్ కు ఈ మూవీ ఔట్ అండ్ అవుట్ వరుణ్ తేజ్ షో అని ఖచ్చితంగా చెప్పి తీరాలి. ఒకరకంగా ఈ పాత్ర వరుణ్ తేజ్ కు టైలర్ మేడ్ కేరక్టర్.తన ఫిజిక్ , తన పర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ ను కట్టిపడేసాడు
అది అతని బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్ కావచ్చు లేదా బాక్సర్‌గా మూవ్స్ అయినా కావచ్చు. ఏదేమైనా వరుణ్ తేజ్ తన పాత్రలో స్ట్రాంగ్ గా ఒదిగిపోయాడు.ఇక..సీనియర్ నటి నదియా విషయానికి వస్తె వరుణ్ తల్లి పాత్రలో ఎదిగిపోయింది. నదియా కాంబినేషన్ లో వరుణ్ చేసిన సీన్స్ అన్నీ చాలా బాగా ఎగ్జిక్యూట్ చేయబడ్డాయి.

ఇక..గని చిత్రానికి ప్రధాన బలం సునీల్ శెట్టి, ఉపేంద్ర, జగపతి బాబు లాంటి దిగ్గజ నటులు అని ఖచ్చితంగా చెప్పొచ్చు.
ప్రతి ఒక్కరూ తమ పాత్రలను పరిపూర్ణంగా న్యాయం చేశారు. ఉపేంద్ర ఫ్లాష్‌బ్యాక్ లో వచ్చి సినిమాకు ఎమోషనల్ టచ్ అందించాడు. బాక్సింగ్ కోచ్‌గా సునీల్ శెట్టి చాలా మంచి పాత్ర పోషించాడు. సినిమాలో మెయిన్ విలన్‌గా జగపతిబాబు తన స్టామినా ఏంటో చూపించారు.
ఇక..హీరోయిన్
సయీ మంజ్రేకర్ తన అందంతో కట్టిపడేసింది. ఈమెకు ఈ చిత్రం పెర్ఫెక్ట్ ఎంట్రీ. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ ఎక్స్‌ప్రెషన్స్ చాలా బాగున్నాయి. టాలీవుడ్ కు మరో మాంచి బ్యూటీ వచ్చిందని చెప్పొచ్చు.
నవీన్ చంద్ర చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసి అందరినీ అలరించాడు.

మూవీ సెకండాఫ్‌లో డీసెంట్ డ్రామా, ఫ్యామిలీ ఎమోషన్స్, మంచి క్లైమాక్స్‌తో మూవీ స్పీడ్ అందుకుంది. ఈ టైం లో బాక్సింగ్ సెటప్, మ్యాచ్ మిక్సింగ్ అంశాలు చాలా బాగా ఎలివెట్ అయ్యాయి.

టెక్నికల్ వాల్యూస్ విషయానికి వస్తె..
ఎక్స్ట్రార్డినరీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో
గని చిత్రం ఆద్యంతం ఆకట్టుకుంటుంది.
లొకేషన్‌లు, బాక్సింగ్ సెటప్ , విజువల్స్ మరియు అద్భుతమైన సినిమాటోగ్రఫీ సాంకేతికంగా ఉన్నతంగా కనిపిస్తుంది.
ఇక మ్యూజిక్ విషయానికి వస్తె.. ఎప్పటిలాగే తమన్ తన BGM తో చెలరేగిపోయాడు.
సన్నివేశాన్ని పూర్తిగా ఎలివేట్ చేయడంతో థమన్ ఈ చిత్రానికి మరో వెన్నెముక. తమన్ సమకూర్చిన సంగీతం, పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ప్లస్ పాయింట్.

డైలాగ్స్ డీసెంట్ గా ఉన్నాయి, ప్రొడక్షన్ డిజైన్ కూడా అలాగే ఉంది. ఫస్ట్ హాఫ్ లో డల్ గా ఉన్న ఎడిటింగ్ సెకండాఫ్ లో క్రిస్ప్ గా ఉంది. బాక్సింగ్ మ్యాచ్‌లన్నింటికీ యాక్షన్ కొరియోగ్రఫీ చాలా పీక్స్ లో ఉంది. ఆడియన్స్ ను కట్టిపడేసే యాక్షన్ కొరియోగ్రఫీ
మాస్ ఆడియన్స్ పై ప్రభావం చూపుతుంది.

ఇక..
దర్శకుడు కిరణ్ కొర్రపాటి విషయానికి వస్తే, రొటీన్ కథనే ఎంచుకున్నా, సెకండాఫ్‌లో సినిమాను చక్కగా నేరేట్ చేశాడు. కొంత కామెడీ, రొమాన్స్ , ఎమోషన్స్‌తో ఫస్ట్ హాఫ్‌ని ఇంకాస్త మెరుగ్గా హ్యాండిల్ చేసి ఉంటే,
సినిమా స్థాయి ఇంకా పెరిగేది.
ఏది ఏమైనా తొలి చిత్రం తో సక్సస్ ఫుల్ దర్శకుడిగా కిరణ్ కొర్రపాటి కి మంచి మార్కులే పడ్డాయి.
ద్వితీయార్ధంలో మ్యాచ్ సినిమాకే హైలైట్. సినిమా చూసే ప్రేక్షకులను కుర్చిలోనే కట్టిపడేసే విధంగా ఉన్నాయి. స్పోర్ట్స్ రివేంజ్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే సన్నివేశాలు ఉన్నాయి. బాక్సర్ గా వరుణ్ తేజ్ న్యాయం చేశాడు.

ఓవరాల్ గా గని గురించి చెప్పాలంటే వరుణ్ తేజ్ వన్ మ్యాన్ షో. మెగా ఫ్యాన్స్ కు, బాక్సింగ్ అభిమానులకు పండగే పండగ.
వార్తా వినోదం రేటింగ్ 6/10

శ్రీనివాస్ నేదునూరి