భారత, పాకిస్థాన్ దేశాల మధ్య ఉన్న పరిస్థితుల వలన, ఇరు దేశాలు ఐసీసీ టోర్నీల లో తప్ప, మరెక్కడా తలపడే అవకాశం లేకుండా పోయింది. అది కూడా, T20 ప్రపంచ కప్, నాలుగేళ్ళకొకసారి వచ్చే వన్ డే ప్రపంచ కప్ లో మరియు ఆసియ కప్ లో నే భారత, పాకిస్థాన్ జట్ల తలపడడం చూస్తాం. అయితే పాకిస్తాన్ మాజీ కెప్టెన్, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ రమీజ్ రాజా ICC ముందు ఒక ప్రతిపాదన పెట్టాడు. అదేమిటంటే, భారత, పాకిస్థాన్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లతో మెగా టోర్నీ నిర్వహించాలని, దాని ద్వారా 750 మిలియన్ డాలర్ల ఆదాయం కూడా వస్తుందని అంచనా వేశాడు. రమీజ్ రాజా ప్రతిపాదనకు ICC ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇప్పటి వరకు నాలుగు దేశాలతో టోర్నీ ICC కూడా నిర్వహించలేదు
Recent Comment