యావత్ సినీ ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కేజీఎఫ్-2 ట్రైలర్ ను తాజాగా చిత్రబృందం విడుదల చేసింది. ఈ సినిమా తెలుగు వెర్ష‌న్ ట్రైల‌ర్‌ను రామ్ చ‌ర‌ణ్ విడుద‌ల చేయగా.. త‌మిళ వెర్ష‌న్‌ను కోలీవుడ్ స్టార్ హీరో సూర్య‌, క‌న్న‌డ వెర్ష‌న్ ట్రైల‌ర్ ను శివ‌రాజ్ కుమార్, బాలీవుడ్ ట్రైల‌ర్ ను స్టార్ హీరో ఫ‌ర్హాన్ అఖ్త‌ర్‌, మ‌ల‌యాళ ట్రైల‌ర్‌ను పృథ్విరాజ్ రిలీజ్ చేశారు. ఇక ఆధ్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ ట్రైలర్ లో రాకీ భాయ్ గా యశ్ నటన, ఆయన పలికిన డైలాగ్స్ ప్రత్యేకాకర్షణగా నిలిచాయి.

కాగా, ఈ సినిమాని హోంబలే ఫిలింస్‌ పతాకంపై విజయ్‌ కిరగందూర్ నిర్మిస్తున్నారు. కన్నడ, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కేజీఎఫ్‌ 2 వేసవి కానుకగా ఏప్రిల్ 14న విడుదల కానుంది. కాగా, ఈ సినిమాలో సంజయ్ దత్, శ్రీనిధి శెట్టి, ప్రకాశ్‌ రాజ్‌, రవీనా టండన్‌, రావు రమేశ్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించగా.. రవి బస్రూర్‌ సంగీతం అందించారు.