మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ (Ram Charan) కథానాయకుడుగా సీనియర్ డైరెక్టర్ శంకర్(Shankar) దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అయితే ఈ మూవీకి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో రామ్‌చరణ్ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం. అందులో ఒకటి స్టూడెంట్ పాత్ర కాగా, మరొకటి ప్రభుత్వ ఉద్యోగి పాత్ర అన్నట్లు తెలుస్తోంది. ఇవే కాకుండా ఈ చిత్రంలో రామ్‌చరణ్ మరో సరికొత్త పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది.
శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘భారతీయుడు’ సినిమాలో కమల్ హాసన్ మాదిరిగా వృద్ధుడి పాత్రలో రామ్‌చరణ్ కనిపించబోతున్నారట. స్టూడెంట్, ప్రభుత్వ ఉద్యోగి, వృద్ధుడి పాత్రతో పాటు రామ్‌చరణ్‌ను ఇప్పటి వరకూ చూడని మరో కొత్త పాత్రలో కూడా శంకర్ చూపెట్టనున్నట్లు తెలుస్తోంది. కాగా, ఇప్పటికే రెండు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఏప్రిల్ 6వ తేదీ నుంచి రీమొదలు కానున్న మూడో షెడ్యూల్ కోసం అమృత్‌సర్ వెళ్ళబోతున్నట్లు సమాచారం. ఆ షెడ్యూల్ లో చెర్రీపై కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ సినిమాలో సునీల్, నవీన్ చంద్ర, అంజలి కీలక పాత్రలు పోషిస్తున్నారు. RC15 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ మూవీని ‘దిల్’ రాజు ఓ భారీ ప్యాన్ ఇండియా మూవీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నారు.
Recent Comment