మెగా పవర్‌ స్టార్‌ రామ్ చరణ్(Ram Charan), యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌(Ntr) హీరోలుగా
దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన తాజా చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఎప్పటినుంచో వేచి చూస్తున్న ఈ మూవీ ఎట్టకేలకు మార్చి 25న విడుదలైంది. దింతో సినిమా సూపర్‌ హిట్ అంటూ ఫ్యాన్స్, సినీ సెలెబ్రెటీలు ప్రశంసిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో 11 వేలకు పైగా థియేటర్స్‌లో విడుదలైన ఈ మూవీ తొలిరోజు రూ.257 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టి బాహుబలి రికార్డుల్ని బద్ధలుకొట్టింది.

ఇదిలావుంటే, ఆర్ఆర్ఆర్ మూవీ యూఎస్ బాక్సాఫీస్ వద్ద తొలి రోజే రికార్డు మిలియన్ డాలర్స్ ని సాధించగా.. తాజాగా ఈ సినిమా రెండో రోజుకి ఏకంగా 7.25 మిలియన్ మార్క్ ని దాటేసినట్లు సమాచారం. అలాగే ఈ సినిమా కేవలం రెండు రోజుల్లోనే 50 శాతం కలెక్షన్స్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ వీకెండ్ నాటికి ఆర్ఆర్ఆర్ మూవీ 10 మిలియన్ కి పైగా కలెక్షన్స్ వసూలు చేసే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.