పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు'(Hari hara Viramallu). ఈ చిత్రానికి ప్రముఖ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో 17వ శతాబ్దపు కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత ఏంఎం రత్నం నిర్మిస్తున్న ఈ మూవీలో హీరోయిన్గా నిధి అగర్వాల్ నటిస్తోంది. ఔరంగజేబు పాత్రలో అర్జున్ రాంపాల్, బాలీవుడ్ ముద్దుగుమ్మ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కనువిందు చేయనున్నట్లు సమాచారం.
ఇప్పటికే 50 శాతం చిత్రీకరణను జరుపుకొన్న ఈ సినిమా, కరోనా మహమ్మారి కారణంగా వాయిదాపడింది. ఈ క్రమంలో చాలా రోజుల విరామం తరువాత తిరిగి షూటింగును ప్రారంభించారు మేకర్స్. ఇప్పటికే చాలా ఆలస్యమైన కారణంగా ఈ సినిమా షూటింగ్ ను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలని పవన్ భావిస్తున్నారట. ఈ క్రమంలోనే ‘హరిహర వీరమల్లు’ సెట్స్ లో పవన్ చెమటోడుస్తున్నారు. ఈ సినిమా కోసంయాక్షన్ నిపుణుల సమక్షంలో పవన్ శిక్షణ పొందుతున్న పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా, మూవీ కోసం 180 కోట్ల మేర బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం
Recent Comment