రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో, టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది.

రాజస్థాన్ రాయల్స్ 8 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది

బట్లర్ సెంచరీ మ్యాచ్ కి హైలైట్.  జైస్వాల్, పడిక్కల్ తొందరగానే అవుట్ అయ్యినా, బట్లర్ ధాటిగా ఆడుతూ సరిగ్గా 68 బంతుల్లో 100 పరుగులు (6×5 | 4×11) చేసి బుమ్రా బౌలింగ్ లో ఔట్ అయ్యాడు.

ఆ తరువాత హేట్మెయిర్ 14 బంతుల్లో 35 పరుగులు, శాంసన్ 21 బంతుల్లో 30 పరుగులు చేసి రాణించారు.  మిగతా బ్యాట్సమెన్ ఎవరు కనీసం రెండంకెల స్కోరు చేయలేదు.

ముంబై ఇండియన్స్ బౌలర్ల లో బుమ్రా, మిల్స్ మూడేసి వికెట్లు తీశారు. పోలార్డ్ ఒక వికెట్ తీశాడు