సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మైంట్‌, 14 రీల్స్ ప్లస్ సంస్థల నిర్మాణంలో టాలెంటెడ్ డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. కీర్తీ సురేశ్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్‌ జరుపుకుంటోంది. మ్యూజిక్‌ సెన్సెషన్‌ తమన్‌ స్వరాలు అందిస్తున్న ఈ సినిమా బ్యాంక్ మోసాల నేప‌థ్యంలో తెర‌కెక్కుతోంది.

అయితే మే 13న విడుదలకి సిద్దమవుతున్న ఈ సినిమా షూటింగ్ ని చిత్రయూనిట్ శరవేగంగా పూర్తి చేసే పనిలో పడ్డారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ అనుకున్నంత వేగంగా జరగడంలేదని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. నిజానికి ఈ సినిమాను మే 12న విడుదల చేస్తామని కరోనా థర్డ్ ఫేజ్ అయిపోగానే ప్రకటించారు. అయితే, ఇటీవల ఉగాదికి సందర్భంగా రిలీజ్‌ చేసిన సర్కారు పోస్టర్‌లో మే 12న విడుద‌ల అని మ‌రోసారి ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ.. సినిమా వాయిదా అనే టాక్ మాత్రం ఆగ‌డం లేదు.