దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి(Rajamouli), యంగ్ టైగర్ ఎన్టీఆర్(Ntr), మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్(Ram Charan) ల కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం “ఆర్ఆర్ఆర్”. ఇందులో కొమురం భీమ్‌గా యంగ్ టైగర్ ఎన్టీఆర్.. అల్లూరి సీతా రామరాజుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్, పెన్ స్టూడియోస్, లైకా సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకువచ్చింది. తొలి రోజు నుంచే హిట్ టాక్ అందుకున్న ఈ చిత్రం ప్రస్తుతం రూ.1000 కోట్ల కలెక్షన్స్ రాబట్టే దిశగా పయనిస్తోంది.
ముఖ్యంగా బాలీవుడ్‌లో RRR మూవీ సంచలనం సృష్టిస్తోంది. ఈ మూవీ విడుదలైన పన్నెండు రోజులల్లోనే అక్కడ రూ.198.75 కోట్లు నెట్ కలెక్షన్స్ అలాగే రూ. 220 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఇక షేర్ కలెక్షన్స్ రూ.97.10 కోట్లు వచ్చాయి. RRR మూవీ బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్స్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ చేరుకోవాలంటే రూ.190 కోట్లు నెట్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉండేది. కానీ ఈ సినిమా ఆ మార్క్ ఇప్పటికే క్రాస్ చేసి రూ.198.75 కోట్ల నెట్ కలెక్షన్స్‌ను సాధించింది.
Recent Comment