ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కొత్త మంత్రివర్గం సోమవారం కొలువు తీరింది. 25 మంది కొత్త మంత్రుల చేత రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ సోమవారం ప్రమాణ స్వీకారం చేయించారు. కొత్త మంత్రి వర్గంలో 70 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చోటు దక్కింది. ప్రస్తుత కేబినెట్‌లో మొత్తం 25 మంది మంత్రులుండగా.. సీనియారిటీ పరంగా 11 మంది మంత్రులను కొనసాగించారు. కొత్తగా మరో 14 మందికి అవకాశం కల్పించారు. ఈ క్రమంలో తాజాగా మంత్రులకు శాఖలు కేటాయించారు. మొత్తం మంత్రివర్గంలో ఉన్న ఐదుగురికి ఉపముఖ్యమంత్రులుగా అవకాశం దక్కింది. వీరిలో కొట్టు సత్యనారాయణ, బూడి ముత్యాల నాయుడు, ఆంజాద్ బాషా, రాజన్న దొర, నారాయణ స్వామిలకు డిప్యూటీ సీఎం హోదా లభించింది.
- ఆదిమూలపు సురేష్ : మున్సిపల్ శాఖ, పట్టణాభివృద్ధి శాఖ
- బొత్స సత్యనారాయణ : విద్యాశాఖ
- బూడి ముత్యాల నాయుడు : పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ
- అంబటి రాంబాబు : జలవనరుల శాఖ
- ఆంజాద్ బాషా : మైనార్టీ సంక్షేమ శాఖ
- దాడిశెట్టి రాజా : రోడ్లు, భవనాల శాఖ
- ధర్మాన ప్రసాదరావు : రెవెన్యూ శాఖ
- గుడివాడ అమర్‌నాథ్ : పరిశ్రమల శాఖ
- బుగ్గన రాజేంద్రనాథ్ : ఆర్థిక శాఖ
- చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ : బీసీ సంక్షేమం, సినిమాటోగ్రఫీ శాఖ
- కొట్టు సత్యనారాయణ : దేవాదాయ శాఖ
- నారాయణ స్వామి : ఎక్సైజ్ శాఖ
- ఉషాశ్రీ చరణ్ : స్త్రీ శిశు సంక్షేమ శాఖ
- మేరుగ నాగార్జున : సాంఘిక సంక్షేమ శాఖ
- గుమ్మనూరు జయరాం : కార్మిక శాఖ
- ఆర్కే రోజా : యువజన సాంస్కృతిక శాఖ, పర్యాటకం
- సీదిరి అప్పలరాజు : పశుసంవర్థక, మత్స్య శాఖ
- తానేటి వనిత : హోమ్ శాఖ
- విడదల రజిని : వైద్య ఆరోగ్య శాఖ, కుటుంబ సంక్షేమ శాఖ
- జోగి రమేష్ : గృహనిర్మాణ శాఖ
- కాకాణి గోవర్థన్‌రెడ్డి : వ్యవసాయం, మార్కెటింగ్ శాఖ
- కారుమూరి వెంకట నాగేశ్వరరావు : పౌర సరఫరాలు శాఖ
- పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి : విద్యుత్ శాఖ, అటవీ శాఖ
- పినిపే విశ్వరూప్ : రవాణా శాఖ
- రాజన్న దొర : గిరిజన సంక్షేమ శాఖ
Recent Comment