రామ్ గోపాల్ వర్మ , పరిచయం అవసరంలేని పేరు.  క్రైమ్ థ్రిల్లర్ లు తీయడం లో నేర్పరి అయిన రామ్ గోపాల్ వర్మ నుంచి వస్తున్న మరో క్రైమ్ థ్రిల్లర్ దహనం.

తండ్రి మరణానికి ప్రతీకారం తీరుకోవాలని తపన పడుతున్న ఒక కొడుకు కధ ఇది. ప్రతీకారం, రక్తపాతం నేపధ్యం లో ఈ వెబ్ సిరీస్ కధ నడుస్తుంది.  దహనం, రామ్ గోపాల్ వర్మ మొదటి వెబ్ సిరీస్.  ఈ వెబ్ సిరీస్ 7 ఎపిసోడ్ లు గా ప్రసారం అవుతుంది.  .

అగస్థ్య మంజు దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ ఈ నెల 14 MX ప్లేయర్ లో విడుదల కానుంది. ఇషా కొప్పికర్‌, అభిషేక్‌ దుహన్‌, నైనా గంగూలీ, సయాజీ షిండే, ప్రదీప్‌ రావత్‌లు, అశ్వత్‌ కాంత్‌ శర్మ, అభిలాష్‌ చౌదరి, పార్వతి అరుణ్‌ ప్రధాన పాత్రధారులు

ఈ వెబ్ సిరీస్ ను హిందీ, తమిళ భాషల్లో డబ్ చేయనున్నారు.

క్రైమ్ థ్రిల్లర్ ల ను తీయడం లో రామ్ గోపాల్ వర్మ నేర్పరి.  ఈ క్రైమ్ థ్రిల్లర్ కూడా ప్రేక్షకులను అలరిస్తుందని ఆశిద్దాం.