మాస్‌ మహారాజ రవితేజ(Ravi Teja )- యంగ్ డైరెక్టర్ శరత్‌ మందవ(Sarath Mandava) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం రామారావు ఆన్ డ్యూటీ( RamaRao On Duty) . ఎల్ ఎల్ పి బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే స్పెయిన్‌లో రెండు పాట‌లను చిత్రీక‌రించి సినిమా షూటింగ్‌ను పూర్తి చేశారు మేకర్స్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులలు జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి చిత్రబృందం తాజాగా ఓ క్రేజీ అప్‌డేట్‌ను ప్ర‌క‌టించారు. ఈ సినిమాలోని ఫ‌స్ట్‌సింగిల్‌కు సంబంధించిన అధికారిక ప్రకటనను గురువారం సాయంత్రం 4.05 గంట‌ల‌కు ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు చిత్రయూనిట్ వెల్లడించారు.

కాగా, ఈ సినిమాలో రవితేజకు జోడిగా దివ్యాంశ కౌశిక్‌, రజిషా విజయన్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇందులో రవితేజ డిప్యూటీ కలెక్టర్‌గా కనిపించనున్నాడు. నాజర్‌, తనికెళ్ల భరణి, పవిత్రాల ఓకేశ్‌ ముఖ్య పాత్రల్లో నటించారు. రామారావు ఆన్‌డ్యూటీతో సీనియర్ నటుడు ణు తొట్టెంపూడి సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు. ఈ చిత్రాన్ని జూన్ 17, 2022న విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది. ఈ క్రమంలోనే సినిమాకి సంబందించిన ప్రమోషన్స్ ను మేకర్స్ ప్రారంభించినట్లు తెలుస్తోంది.