మోహన్‌రాజా(Mohan Raja) దర్శకత్వంలో చిరంజీవి(Chiranjeevi) గాడ్‌ఫాదర్‌(God Father) అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మలయాళ సూపర్‌ హిట్‌ చిత్రం లూసిఫర్‌కి రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా.. బాలీవుడ్‌ సూపర్ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌(Salman Khan) కీలక పాత్రలో నటించనున్నాడు. ప్రస్తుతం ‘గాడ్ ఫాదర్’ సినిమా రెగ్యులర్ షూటింగ్ ముంబైలో జరుగుతోంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో టాలీవుడ్ అగ్ర దర్శకుడు పూరీ జగన్నాధ్ (Puri Jagannath) అతిథి పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో పూరీ ఓ పవర్ ఫుల్ జర్నలిస్ట్ పాత్రలో కనిపించనున్నాడని సమాచారం. ఇందులో ఆయన పాత్ర కొద్దిసేపే ఉన్నప్పటికీ కథను మలుపుతిప్పేదిగా ఉండబోతుందని తెలుస్తోంది. నిజానికి చిరుతో సినిమా చేయాలని పూరీ జగన్నాధ్ చాలా రోజుల నుంచి అనుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఆయనకి ఓ కథ కూడా వినిపించాడు. కానీ ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్ళలేదు. ఏదేమైనా ఇప్పుడు చిరుతో కలిసి నటిస్తూ తన డ్రీమ్ నెరవేర్చుకుంటున్నాడు పూరీ జగన్నాధ్. కాగా, తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సూపర్ గుడ్ ఫిల్మ్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.