వై ఎస్ వివేకానంద రెడ్డి మరణించి 5 సంవత్సరాలు దాటింది. అయినా ఇప్పటికి ఆయన మృతి కి సంబంధించిన కేసు ఇంకా తేలలేదు. 

సాక్షాత్తు,  మాజీ ముఖ్య మంత్రి రాజశేఖర్ రెడ్డి తమ్ముడు, ప్రస్తుత ముఖ్య మంత్రి బాబాయ్, అయిన, వై ఎస్ వివేకానంద రెడ్డి మృతి కేసు ఇప్పటి దాకా తేలకపోవడానికి కారణాలు ఏమిటి.

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చెల్లెలు, షర్మిల, బహిరంగంగా అవినాష్ రెడ్డి గురించి మాట్లాడుతుంటే, ముఖ్య మంత్రి హోదాలో తీసుకుంటున్న చర్యలు ఏమిటి.  పోలీసులు ఎందుకు మాట్లాడట్లేదు.

మొన్న వివేకానంద రెడ్డి కూతురు సునీత గారు నేడు ఆయన భార్య ఇంతగా మొర పెట్టుకుంటున్న ముఖ్యమంత్రి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు.  కేంద్ర ప్రభుత్వం, ఈ విషయం లో ఎందుకు చొరవ తీసుకోవడం లేదు.  సహజ మరణమా లేక హత్యా అనే విషయాన్నీ ఎందుకు 5 సంవత్సరాలైనా తేల్చ లేకపోతున్నారు.

ముఖ్య మంత్రిని గులక రాయి పెట్టి కొడితే నానా హుంగామా చేసిన పోలీసులు.  వివేకానంద రెడ్డి కేసు ను ఎందుకు చదించలేక పోతున్నారు.  5 సంవత్సరాలు దాటినా వై ఎస్ వివేకానంద రెడ్డి మృతి కేసులో పురోగతి కనిపించడం లేదు.

మన న్యాయ వ్యవస్థ బలహీనం గా ఉండడమా లేక సాక్ష్యాలు లేకా తప్పు చేసిన వాళ్ళ బ్యాక్ గ్రౌండ్ స్ట్రాంగ్ గా ఉండడమా.  బెయిల్ మీద వచ్చిన వ్యక్తి ముఖ్య మంత్రి కావడం అండ్ రాష్ట్రాన్ని పరిపాలించడం.  ప్రజా స్వామ్య వ్యవస్థ సిగ్గు తో తల దించుకోవాల్సిన పరిస్థితి. ప్రధాన మంత్రి, ముఖ్య మంత్రి ఎవరైనా  వాళ్ళ పదవి కాపాడుకోవడం లో బిజీ గా ఉన్నారు.

ప్రజా స్వామ్య ప్రభుత్వం లో ప్రజలే పాలకులను నిర్ణయించుకునే మహత్తర అవకాశం ఉంది. ఈ ఓటు అనే ఆయుధం తో ఇలాంటి పాలకులకు బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది.

ఓటరు మహాశయా, మన భవిష్యత్తు మన చేతుల్లోనే