పవన్ కళ్యాణ్ సినిమాలతో,రాజకీయాలతో బిజీ గా ఉన్నారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం OG, హరి హర హర వీర మల్లు, ఉస్తాద్ చిత్రాలలో నటిస్తూ ఉన్నారు. ఎన్నికల కారణం గా సినీమాలకు సమయం కేటాయించలేక పోతున్నారు. ఎన్నికలు పూర్తి కాగానే సినిమాలపై దృష్టి సారిస్తారు. తెలుగు సినీ పరిశ్రమలో, హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా ఫ్యాన్స్ క్రేజీ ఫాలోయింగ్ ఉన్న హీరో పవన్ కళ్యాణ్
అయితే ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించిన అఫిడవిట్ ప్రకారం జన సేనాని గత ఐదేళ్ల సంపాదన 114.76 కోట్లు. పవన్ కళ్యాణ్ పీఆర్ టీమ్ ఈ వివరాలను వెళ్లడించింది.
ఈ ఐదేళ్ల లో 20 కోట్లను విరాళాల రూపంలో అందజేశారు. 73.92 కోట్లు పన్నుల రూపంలో చెల్లించగా, 64.36 కోట్లు అప్పులు ఉన్నాయి.
ఈ లెక్కలు చూస్తుంటే నిజాయితీ కనిపిస్తోంది. మనం ఎంత నిజాయితీగా ఉన్నా, డబ్బులు తీసుకుని ఓట్లు వేసే జనం ఉన్నంత వరకు, ఈ వ్యవస్థను ఎవరు ఏమి చేయలేరు.
Recent Comment