ఈ రోజు AP కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం 24 మంది మంత్రలు రాజీనామా చేశారు. ఈ నెల 11 న కొత్త Cabinet ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు.  Cabinet లో తీసుకున్న నిర్ణయాలపై Minister పేర్ని నాని మీడియా ప్రతినిధుల తో చివరి సారి గా మాట్లాడారు.  మూడు సంవత్సరాల తన పదవీ కాలం లో తన అనుభవాలను మీడియా మిత్రులతో పంచుకున్నారు

Cabinet ఆమోదం తెలిపిన ప్రధాన అంశాలు

  • వ్యవసాయ శాఖ ప్రతిపాదించిన మిల్లెట్ పాలసీ
  • కొత్త రెవిన్యూ డివిజన్ల కు
  • రాజమహేంద్రవరం లో ఆంధ్ర ప్రదేశ్ టూరిజం కార్పొరేషన్ కు 6 ఎకరాలు ఉచితం గా ఇచ్చేందుకు
  • కర్నూల్ జిల్లా పారిశ్రామిక పార్క్ కు 82 ఎకరాలు కేటాయింపు
  • రాజమహేంద్రవరం, కర్నూల్, విజయనగరం,అనంతపురం, శ్రీకాకుళం జిల్లాల లో ఆసుపత్రుల నిర్మాణానికి భూ కేటాయింపులపై
  • సున్నా వడ్డీ పథకం మరో ఏడాది పొడిగింపు
  • రాష్ట్రం లో ఏకలవ్య పాఠశాల ల ఏర్పాటుకు ఆమోదం
  • ప్రభుత్వ వైద్యులు ఎవరు కూడా ప్రైవేట్ గ ప్రాక్టీస్ చేయకూడదు అన్న కఠిన నిబంధనలు