నేచురల్ స్టార్ నాని(Nani) ప్రస్తుతం బిజీగా ఉన్నాడు. తన తాజా చిత్రం ‘అంటే.. సుందరానికీ!’ మూవీ షూటింగ్ ఇటీవల పూర్తి చేసిన నాని తన నెక్స్ట్ మూవీ ‘దసరా’(Dasara)పై దృష్టి సారించాడు. ఈ సినిమాలో నాని సరసన కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తుండగా..
శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇందులో సముద్రఖని, సాయి కుమార్, జరినా కీలక పాత్రలు పోషించనున్నారు. ఈ చిత్రానికి తమిళ్ పాపులర్ మ్యూజిక్ డైరెక్ట్ సంతోష్ నారయణ్ సంగీతం అందిస్తున్నారు.
తెలంగాణలోని సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్‌వీసీ) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖని ప్రాంతంలో జరుగుతోంది. ఈ షెడ్యూల్ లో ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కొరియోగ్రఫీలో నాని, కీర్తి సురేష్‌లపై ఓ పాటను షూట్ చేస్తున్నారు. దాదాపు 500 మంది డ్యాన్సర్లతో ఈ పాటను షూట్ చేస్తున్నట్లు సమాచారం. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నఈ సినిమా నాని కెరీర్ లో తొలి పాన్ ఇండియా మూవీగా రూపొందుతోంది. గోదావరిఖనిలోని సింగరేణి కోల్ మైన్స్‌లోని ఓ పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.
Recent Comment