యావత్ సినీ ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కేజీఎఫ్-2 ట్రైలర్ ను ఇటీవల చిత్రబృందం విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో పలు రికార్డులు క్రియేట్ చేస్తోంది. కేవలం 24గంటల్లోనే అన్ని భాషల్లో కలిపి 109 మిలియన్‌ వ్యూస్‌ రాబట్టి ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ చిత్రాల రికార్డులు బద్దలుకొట్టింది. కేజిఎఫ్2 ట్రైలర్‌కి హిందీలో 51 మిలియన్ ,తెలుగులో 20 మిలియన్, కన్నడలో 18 మిలియన్‌, తమిళంలో 12 మిలియన్, మలయాళంలో 8 మిలియన్‌ వ్యూస్‌ వచ్చాయి.

ఆర్ఆర్ఆర్ ట్రైలర్ 24 గంటల్లో అన్ని భాషల్లో మొత్తంగా 51.12 మిలియన్ల వ్యూస్ సాదించగా.. ఆ తర్వాత రాధే శ్యామ్ మూవీ ట్రైలర్ 57.5 మిలియన్ల వ్యూస్ సాధించి ఆ రికార్డును బద్దలుకొట్టింది తాజాగా ఆ రికార్డును కేజీఎఫ్ 2 మూవీ బద్దలుకొట్టింది. కాగా, హొంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఏప్రిల్‌14న విడుదల కానుంది.