మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్‌(Varun Tej) హీరోగా కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గని’(Ghani). ఈ సినిమాలో వరుణ్‌ తేజ్‌ సరసన బాలీవుడ్‌ నటి సయీ(Sayi Manjrekar) మంజ్రేక‌ర్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఉపేంద్ర‌(Upendra), సునీల్ శెట్టి(Sunil Shetty), న‌వీన చంద్ర (Naveen Chandra), జగపతి బాబు (Jagapati Babu) త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో కనిపించనున్నారు. తమన్‌(Thaman) ఈ సినిమాకు సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్‌ సమర్పణలో అల్లు బాబీ, సిద్ధు ముద్ద నిర్మించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు గని నుంచి బిగ్‌ అప్‌డేట్‌ ఇచ్చారు చిత్రబృందం. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 8న విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్‌ (Geeta Arts) అధికారికరంగా వెల్లడించింది.

అయితే ఈ సినిమా ట్రైలర్ విడుదలై ప్రేక్షకులను, అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అయితే ఈ మూవీ ప్రమోషన్స్ ను ప్రారంభించడం జరిగింది. రామ్‌చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి రూపొందించిన చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో దక్షిణాదిలో 1000కి పైగా థియేటర్లలో ఈ సినిమా ప్రదర్శన లో గని ట్రైలర్ ను ప్రమోట్ చేయనున్నారు. కాగా ఈ సినిమాలో వ‌రుణ్‌ తేజ్ ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌ని డిఫ‌రెంట్ క్యారెక్టర్‌లో సరికొత్త లుక్‌లో బాక్సర్‌గా కనిపించబోతున్నాడు.