గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్ నాలుగు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది.  ఓపెనర్లు వేడ్ 12 పరుగులు, గిల్ 13 పరుగులు చేసి అవుట్ అయ్యారు. 53 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన గుజరాత్ టైటాన్స్ ను కెప్టెన్ హార్డిక్ పాండ్య అభినవ్ మనోహర్ లు నాలుగవ వికెట్ కు పరుగులు జోడించారు.  అభినవ్ మనోహర్ 28 బంతుల్లో 43 పరుగులు చెయ్యగా, కెప్టెన్ హార్డిక్ పాండ్య 52 బంతుల్లో 87 పరుగులు పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.  చివర్లో మిల్లర్ చెలరేగి పోయి కేవలం 14 బంతుల్లో 31 పరుగులు  కెప్టెన్ హార్డిక్ పాండ్య తో పాటు అజేయం గా నిలిచాడు.  రాజస్థాన్ రాయల్స్ బౌలర్ల లో చాహల్, కులదీపసేన్, పరాగ్ తలా ఒక వికెట్ తీశారు.

అనంతరం 193 పరుగుల లక్ష్యం తో బ్యాటింగ్ ప్రారంభించిన రాజస్థాన్ రాయల్స్ 74 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్ బట్లర్ ధాటిగా గా ఆడి కేవలం 24 బంతుల్లో 54 పరుగులు చేసి ఫెర్గుసన్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు.  పాడిక్కల్ డక్ అవుట్ అవగా, వాన్ డేర్ డుస్సేన్ 3 పరుగులతోను, హెట్ మీర్ 6 పరుగు లతో క్రీజ్ లో ఉన్నారు.  ఫెర్గుసన్ రెండు కీలక వికెట్లు తీయగా, దయాల్ ఒక వికెట్ తీశారు.

కడపటి వార్తలందేసరికి రాజస్థాన్ రాయల్స్ 10 ఓవర్ల లో నాలుగు వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది