దిగ్గజ దర్శకుడు రాజమౌళి రూపొందించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’(RRR). మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విడుదలైన తొలి రోజు నుంచే హిట్ టాక్‌తో దూసుకెళ్తూ బాక్సఫీసు దుమ్ముదులుపుతోంది. కేవలం మూడు రోజల్లోనే రూ. 500 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసి బాహుబలి రికార్డుని బద్దలుకొట్టింది. అయితే ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలైన అన్ని భాషల్లో కూడా కూడా భారీ ఎత్తున కలెక్షన్లు రాబడుతున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే హిందీలో కూడా ఈ సినిమా సత్తా చాటింది. తాజాగా అక్కడ కేవలం 5 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లో చేరిన మరో దక్షిణాది చిత్రంగా ఆర్ఆర్ఆర్ సరికొత్త రికార్డు సృష్టించింది. తాజాగా హిందీలో 5వ రోజుకి గాను 16 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం మొత్తంగా 107 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. ఈ వీకెండ్ వరకు ఆర్ఆర్ఆర్ జోరు ఇలాగే కొనసాగితే 200 కోట్ల వసూళ్లు కూడా సునాయాసంగా సాధిస్తుందని చెప్పొచ్చు.
కాగా, ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్, ఆయన జోడీగా అలియాభట్ నటించింది. ఇక కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ నటించగాఆయనకు జోడీగా హాలీవుడ్ నటి ఓలివియా మోరిస్ సందడి చేసింది.
Recent Comment