యువ కథానాయకుడు నాగశౌర్య (Naga Shourya) హీరో నటిస్తున్న చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి’. (Krishna Vrinda Vihari) అనీష్‌ ఆర్‌. కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీలో ప్రముఖ సింగర్‌ షిర్లే సెటియా హీరోయిన్‌గా చేస్తోంది. ఐరా క్రియేషన్స్‌ పతాకంపై ఉషా మూల్పూరి నిర్మించగా శంకర్‌ ప్రసాద్‌ మూల్పూరి సమర్పిస్తున్నారు.

శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ మూవీ రిలీజ్ డేట్ ను తాజాగా ప్రకటించారు చిత్రబృందం. మార్చి 28న టీజర్‌ని విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఇక సాయి శ్రీరామ్‌ ఛాయాగ్రహణం బాధ్యతలు నిర్వర్తిస్తుండగా.. కృష్ణ వ్రింద విహారి ఏప్రిల్‌ 22న
విడుదల కానుంది. ఈ సినిమాలో సీనియర్ నటి రాధిక కీలకపాత్ర పోషిస‍్తున్నారు. కాగా, వెన్నెల కిషోర్‌, రాహుల్‌ రామకృష్ణ, సత్య, బ్రహ్మాజీ తదితరుల నటిస్తున్న ఈ సినిమాకు మహతి స్వరసాగర్‌ సంగీతమందిస్తున్నారు