బీసీసీఐ 2023-27 సంవత్సరాలకు సంబంధించి ఐపీల్ మీడియా రైట్స్ కోసం టెండర్ల ను ఆహ్వానించడానికి ఇన్విటేషన్ ప్రకటన విడుదల చేసింది.  అయితే ప్రకటన విడుదల చేసిన వారానికే పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీ లు దరఖాస్తు ఫారాలు కొనుగోలు చేశారు.  టైమ్స్ అఫ్ ఇండియా కథనం ప్రకారం, అమెరికన్ టెక్ సంస్థ అయిన ఆపిల్ కూడా దరఖాస్తు ఫారాలను కొనుగోలు చేసే అవకాశం ఉంది.

ఐపీల్ లో ఆడే మ్యాచ్ లు – 74. బీసీసీఐ 2023-27 సంవత్సరాలకు సంబంధించి ఐపీల్ మీడియా రైట్స్  కోసం బిడ్లను ఆహ్వానిస్తోంది  వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

  • భారత ఉపఖండం లో టీవీ ప్రసార హక్కుల విలువ కనీస ధర 18,130 కోట్లు
  • భారత ఉపఖండం లో డిజిటల్  ప్రసార హక్కుల విలువ కనీస ధర 12,210 కోట్లు
  • టీవీ, డిజిటల్ ప్రసార హక్కులు రెస్ట్ అఫ్ ది వరల్డ్ కనీస ధర 1,110 కోట్లు
  • భారత ఉపఖండం లో నాన్ ఎక్సక్లూసివ్  డిజిటల్ ప్రసార హక్కుల విలువ కనీస ధర 1,440 కోట్లు.
  • మొత్తం గా ఐపిఎల్ మీడియా హక్కులు కనీస ధర 32,890 కోట్లు.

టెండర్ వేయడానికి అవసరమైన ఇన్విటేషన్ ఫారం కు (ITT) ఆఖరు తేది – 10th May

కార్పొరేట్ దిగ్గజ కంపెనీ లు అయిన డిస్ని హాట్ స్టార్, రిలయన్స్ వయాకామ్ 18, సోనీ, జీ, అమెజాన్, ఆపిల్ లు పోటీ పడుతున్నాయి.  ఇంకా ఎంత మంది కార్పొరేట్ దిగ్గజ కంపెనీ లు ఐపీల్ మీడియా హక్కుల కోసం పోటీ పడతాయో చూడాలి.