దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ మల్టీ స్టారర్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఈ సినిమాలో కొమురం భీమ్‌గా యంగ్ టైగర్ ఎన్టీఆర్‌(Ntr), అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌(Ramcharan) ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. దాదాపు రూ. 400 కోట్లు భారీ బడ్జెట్‌తో ఈ పాన్‌ ఇండియా సినిమాను డీవీవీ దానయ్య నిర్మించారు. యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఇందులో రామ్ చరణ్, ఎన్టీఆర్‌ల నటన ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకుంటోంది.

ఈ క్రమంలోనే ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టిందంటూ అభిమానులు అంతా ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ మూవీ తొలి రోజు క‌లెక్ష‌న్స్‌ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం…

(తెలంగాణ+ఆంధ్రప్రదేశ్) రాష్ట్రాల్లో ఆర్ఆర్ఆర్ తొలి రోజు వసూళ్లు..

★నైజాం – రూ. 23.30 కోట్లు
★సీడెడ్ – రూ. 17.00 కోట్లు
★ఉత్త‌రాంధ్ర – రూ. 7.40 కోట్లు
★వెస్ట్ గోదావ‌రి – రూ. 5.93 కోట్లు
★నెల్లూరు – రూ. 5.01 కోట్లు
★హిందీ వెర్షన్ – రూ. 18 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు సాధించింది.

అలాగే ఆర్ఆర్ఆర్ మూవీ ఓవ‌ర్ సీస్ లో 5 మిలియ‌న్ డాల‌ర్ల మైలురాయిని క్రాస్ చేసింది. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే 200 కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేస్తుందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.