వరుణ్ తేజ్(Varun Tej ) హీరోగా రానున్న సినిమా గని(Ghani ) . కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో సాయి మంజ్రేకర్ కథనాయికగా నటిస్తున్నారు. ఫిబ్రవరి 25న విడుదల అవ్వాల్సి ఉంది. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan )నటించిన భీమ్లానాయక్(Bheemla Nayak ) రిలీజ్ కానున్న నేపథ్యంలో గని సినిమా వాయిదా వేశారు. ఈ మూవీని ఏప్రిల్ లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు.అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ సినిమా బాక్సింగ్ నేపద్యంలో సాగనుంది.

గని (Ghani )టీజర్ ,పాటలకు ఆడియన్స్ నుండి మంచి స్పందన వచ్చింది. భీంలా నాయక్ (Bheemla Nayak )కోసం తమ సినిమా వాయిదా వేస్తున్నట్లు గని మేకర్స్ తెలిపారు.బాబాయితో పోటి వద్దు అనుకొని వెనకడుగు వేసిన వరుణ్ తేజ్(Varun Tej ) ,గని మూవీని ఏప్రిల్ 8న విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారు.