టాలీవుడ్ యువ కథానాయకుడు విశ్వక్ సేన్( Vishwak Sen ) వైవిద్యమైన చిత్రాలను ఎంపిక చేసుకుంటూ తెలుగుచిత్రసీమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని ఏర్పాటు చేసుకున్నాడు. విశ్వక్ సేన్ నటిస్తున్న తాజా చిత్రం ‘అశోకవనంలో అర్జున కళ్యాణం'( Ashoka Vanamlo Arjuna Kalyanam). విద్యాసాగర్ చింత దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రుక్సర్ ధిల్లాన్ హీరోయిన్‌గా నటించింది. సుధీర్ చంద్ర నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ప్రచారచిత్రాల్లో పెళ్లి కోసం ఆరాటపడే మిడిల్ క్లాస్ అబ్బాయిలా విశ్వక్ సేన్ కనిపించిన తీరు అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకుంది.
కాగా, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మరో కొత్త విడుదల తేదీని ప్రకటించారు. ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సినిమాను మే6న విడుదల చేయనున్నట్లు పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. కాగా, జై క్రిష్ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాకుకె.పవన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు
Recent Comment