చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్, హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 7 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది.
చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్ లో ఒక్క అర్ధ సెంచరీ కూడా నమోదు కాలేదు. ఓపెనర్లు ఉతప్ప 15 పరుగులు, గైక్వాడ్ 16 పరుగులు చేసి అవుట్ అయ్యారు. మొయిన్ ఆలి టాప్ స్కోరర్, 35 బంతుల్లో 48 పరుగులు చేశాడు. రాయుడు 27 పరుగులు, జడేజా 23 పరుగులు చేశారు.
సన్ రైజర్స్, హైదరాబాద్ బౌలర్ల లో సుందర్, నటరాజన్ రెండేసి వికెట్లు తీయగా, భువనేశ్వర్ కుమార్, జాన్సెన్, మార్కరం తలా ఒక వికెట్ తీశారు.
అనంతరం పరుగుల లక్ష్యం తో బ్యాటింగ్ ప్రారంభించిన సన్ రైజర్స్, హైదరాబాద్ ఓపెనర్లు అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్ మొదటి వికెట్ కు 89 పరుగులు జోడించి శుభారంభాన్ని అందించారు. కేన్ విలియమ్సన్ 32 పరుగుల వద్ద ముకేష్ చౌదరి బౌలింగ్ లో ఔట్ అయ్యాడు
అభిషేక్ శర్మ 50 బంతుల్లో 75 పరుగులు చేసి బ్రేవో బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. రాహుల్ త్రిపాఠి 15 బంతుల్లో, రెండు సిక్సర్లు, నాలుగు ఐదు సహాయంతో 39 పరుగులు చేసి అజేయం గా నిలిచాడు. అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి రెండో వికెట్ కు 56 పరుగులు జోడించారు.
రాహుల్ త్రిపాఠి, నికోలస్ పూరన్ మరో వికెట్ పడకుండా సన్ రైజర్స్, హైదరాబాద్ కు విజయం చేకూర్చారు
Recent Comment