యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్(Ntr), మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్(Ram Charan) ,దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli)ల కాంబినేష‌న్లో తెరకెక్కిన చిత్రం “ఆర్ఆర్ఆర్”.ఇందులో కొమురం భీమ్‌గా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌.. అల్లూరి సీతా రామరాజుగా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టించారు.పాన్‌ఇండియా లెవెల్లో రూపొందుతున్న ఈ సినిమాలో చరణ్ కు జోడిగా ఆలియా భట్‌(ALIA BHATT) నటిస్తుండగా.. ఎన్టీఆర్ కు జంటగా హాలీవుడ్‌ నటి ఒలీవియా మోరిస్‌ నటించనున్నారు. భారీ బడ్జెట్ తో డీవీవీ ఎంటర్‏టైన్మెంట్స్, పెన్ స్టూడియోస్, లైకా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా మార్చి 25న విడుదల కానుంది.

అయితే ప్రస్తుతం ఈ సినిమాకు అన్ని ప్రాంతాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఒక్క హిందీలోనే రికార్డు స్థాయి థియేటర్స్ లో విడుదల అవుతున్నట్టు తెలుస్తోంది. దింతో ఈ ఘనత సాధించిన తొలి భారతీయ సినిమాగా ఆర్ఆర్ఆర్ అరుదైన రికార్డు క్రియేట్ చేసింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ చిత్రం పెద్ద ఎత్తున రిలీజ్ కానుంది. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం ఒక్క హైదరాబాద్ నగరంలోనే అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో ఇప్పటికే 2.5 కోట్ల కలెక్షన్లు రాబట్టింది.