సీనియర్ హీరో గోపీచంద్‌(Gopi Chand) కెరీర్‌ పరంగా జెడ్‌ స్పీడ్‌లో దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం గోపీచంద్‌ ద‌ర్శ‌కుడు మారుతి(Maruthi) తో చేస్తున్న తాజా చిత్రం ‘పక్కా కమర్షియల్’. సీనియర్ నిర్మాత అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ – యూవీ క్రియేష‌న్స్‌లో ప్రొడ్యూస‌ర్ బ‌న్నీ వాసు నిర్మిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్‌, ట్రైలర్లకు మంచి అభిమానుల నుంచి చక్కటి స్పందన లభించింది. ఈ సినిమా జులై 1, 2022న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలాఉంటే, ఈ సినిమా విడుదల కాకముందే గోపీచంద్ మరో సినిమాను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.

తాజాగా గోపీచంద్ తమిళ స్టార్ డైరెక్టర్‌తో సినిమా చేసేందుకు ఒకే చెప్పినట్టు సమాచారం. గతకొంత కాలంగా గోపీచంద్ సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. అంతకుముందు చేసిన సీటీమార్ సినిమా కూడా బాక్సఫీసు వద్ద బోల్తాపడింది ఈ క్రమంలో ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉన్న పక్కా కమర్షియల్ సినిమా మీదే గోపీచంద్ ఆశలు పెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలోనే తన కొత్త సినిమాను తమిళ స్టార్ డైరెక్టర్‌ సింగం సిరీస్‌తో వరుస హిట్స్ అందుకున్న హరితో చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన అధికారిక త్వరలోనే రాబోతుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.