పాన్ ఇండియా సినిమా ‘లైగర్‌’(Liger) తర్వాత రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ(Vijay Devarakonda), అగ్ర దర్శకుడు పూరి జగన్నాథ్‌(Puri Jagannadh) కాంబినేషన్‌లో ‘జనగణమన’ (Janaganamana)అనే మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు వంశీపైడిపల్లి , చార్మీ కౌర్‌ సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈరోజు (మంగళవారం) ఈ సినిమాకు సంబందించిన అధికారిక ప్రకటన చేశారు మేకర్స్. ‘జేజీఎమ్​’ పేరుతో టైటిల్​ పోస్టర్​ను రిలీజ్ చేశారు. ఈ క్రమంలోనే ఈ సినిమా రిలీజ్​ డేట్​ను కూడా ప్రకటించేశారు. 2023 ఆగస్టు 23న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు తెలిపారు.

ఇదిలాఉంటే.. ప్రస్తుతం ‘లైగర్’ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ప్రముఖ బాక్సర్​ మైక్​టైసన్​ కీలక పాత్ర పోషించారు. అనన్య పాండే హీరోయిన్​. ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.అయితే లైగర్ మూవీ రిలీజ్ అవడానికి ముందే ముందే ఈ సినిమాను ప్రారంభించడం విశేషం. కాగా, జనగణమన చిత్రంలో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) మిలిటరీ ఆఫీసర్ గా పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ క్రమంలోనే లైగర్ కోసం పొడవాటి జుట్టుతో కనిపించిన విజయ్.. జనగణమన కోసం మిలట్రీ హెయిర్ కట్ లోకి మారిపోయాడు.