రాజస్థాన్ రాయల్స్ ఆరు వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది.

సమిష్టి కృషి కి మారు పేరు రాజస్థాన్ రాయల్స్.  టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్  కు రాజస్థాన్ రాయల్స్ బ్యాట్సమెన్ చుక్కలు చూపించారు. ప్రతి బ్యాట్స్ మెన్ తమ వంతు పాత్ర పోషించారు.

ఓపెనర్లు బట్లర్, జైస్వాల్ తొలి వికెట్ కు ఆరు ఓవర్ల లో 58 పరుగులు జోడించారు. బట్లర్ 35 పరుగులు , జైస్వాల్ 20 పరుగులు చేసి అవుట్ అయ్యారు.  

ఆ తరవాత వచ్చిన సంజూ శాంసన్, పడిక్కల్ చెలరేగి పోయారు. సంజూ శాంసన్ 27 బంతుల్లో 55 పరుగులు, పడిక్కల్ 29 బంతుల్లో 41 పరుగులు చేశారు.   చివర్లో వచ్చిన హెట్ మేయర్ కేవలం 13 బంతుల్లో 32 పరుగులు చేశాడు

సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్ల లో నటరాజన్, ఉమ్రాన్ మాలిక్ రెండేసి వికెట్లు తీయగా షెపర్డ్, భువనేశ్వర్ కుమార్ తలా ఒక వికెట్ తీశారు