రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు.సమయాన్ని బట్టి రాజకీయ పరిస్థితులు మారిపోతాయి. ఇక ఏపీలో(Ap ) అధికారం కోల్పోయి విపక్ష్మంలో ఉన్న తెలుగుదేశం(TDP) పార్టీ తెలంగాణలో (Telangana)మళ్ళీ తన సత్తా చాటాలని ప్రయత్నాలు మొదలు పెట్టింది. తెలంగాణలో టీఆర్ఎస్ కు(TRS ) తామే పోటీ కావాలని భావిస్తున్నారు.గతంలో కలిసి ఉన్న రెండు పార్టీలు విభేదాల కారణంగా విడిపోయాయి.ఇక ఏపీ తో పాటు తెలంగాణలో(Telangana) కూడా మళ్లీ పుంజుకోవాలని టీడీపీ చూస్తోంది.
TDP కి తెలంగాణలో ఇంకా ఆదరణ ఉందని చంద్రబాబు (Chandrababu )వర్గం భావిస్తోంది. టీడీపీకి పట్టు ఉన్న ప్రాంతాలలో మళ్ళీ ప్రభావం చూపాలని ప్రయత్నాలు చేస్తోంది.అందుకే చంద్రబాబు తెలంగాణ టీడీపీ మీద ప్రత్యేక దృష్టి సారించారు.తెలంగాణలో టీడీపీ(TTDP)సభ్యత్వ నమోదు కార్యక్రమం చెయ్యాలని చూస్తున్నారు. ఇందుకోసం కార్యకర్తలకి ఆదేశాలు జారీ చేస్తున్నారు.తెలంగాణలో సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు 2 లక్షల రూపాయలు ప్రమాద బీమా ఇచ్చేందుకు రెడీ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో TRS కి పోటీ మేమే అంటున్నారు తెలుగుదేశం నాయకులు. మరి అధికారంలో ఉన్న కేసీఆర్ (KCR)పార్టీకి టీడీపీ ఎంత వరకు పోటీ ఇస్తుందా అన్నది చూడాలి.
Recent Comment