కోల్ కతా నైట్ రైడర్స్ పై రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు మూడు వికెట్ల తేడాతో ఘన విజయం

తక్కువ స్కోర్ లు నమోదైన ఈ మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠభరితం గా సాగింది.

మొదట బ్యాటింగ్ చేసిన కోల్ కతా నైట్ రైడర్స్ 18.5 ఓవర్ల లో 128 పరుగులకే కుప్ప కూలింది.  రస్సెల్ 25 పరుగుల తో టాప్ స్కోరర్ గా నిలిచాడు.

రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు బౌలర్ల లో హాసరంగ 4 వికెట్లు తీయగా ఆకాష్ దీప్ 3 వికెట్లు, హర్షల్ పటేల్ 2 వికెట్లు, సిరాజ్ ఒక వికెట్ చొప్పున తీశారు.

అనంతరం 129 పరుగుల విజయ లక్ష్యం తో బ్యాటింగ్ ప్రారంభించిన రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు ఆదిలో తడబాటుకు గురైంది.

షెర్ఫాన్ రూథర్ ఫోర్డ్ 28 పరుగులు,  షాబాజ్ అహ్మద్ 27 పరుగులు చేసి రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు ను విజయ పధం లో నడిపారు. 

మధ్యలో మళ్ళీ తడబాటుకు గురైనా, చివరలో దినేష్ కార్తీక్, హర్షల్ పటేల్ లు సమయోచితం గా ఆడి రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు ను గెలుపు తీరాలకు చేర్చారు.  దినేష్ కార్తీక్ ఆఖరి ఓవర్ లో ఒక సిక్స్, ఒక ఫోరు బాది గెలుపును ఖాయం చేశాడు     

కోల్ కతా నైట్ రైడర్స్ బౌలర్ల లో టీం సౌథీ 3 వికెట్లు తీయగా, ఉమేష్ యాదవ్ 2 వికెట్లు తీశాడు.  సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి తలా ఒక వికెట్ తీశారు